Chandrababu : స్వర్ణాంధ్ర విజన్2047 లక్ష్యసాధనకు కృషి చేద్దాం : చంద్రబాబు
రాజ్యాంగ స్ఫూర్తితో వికసిత్ భారత్2047, స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు. గణంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లి (Undavalli) నివాసంలో ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi), రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేడ్కర్ (Ambedkar) చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్య నీడలో సురక్షితంగా జీవించడానికి వీలుగా రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభవేళ,భారత ప్రజలకు శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు.













