సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు కట్టన వేలాది టిడ్కో ఇళ్లు ఇవే. చూడండి జగన్. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే నిదర్శనం. ఈ నాలుగేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లెన్ని? అవి ఎక్కడ? జవాబు చెప్పగలవా? అని సీఎం జగన్ను ట్యాగ్ చేస్తూ ఆయన దిగిన సెల్ఫీ ఫొటోలతో ట్వీట్ చేసిన చంద్రబాబు.. జగన్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే పార్టీ క్యాడర్, నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.













