నీతి, నిజాయితీ గలవాళ్లే టిడిపిలో చేరుతున్నారు: ముఖ్యమంత్రి
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీబాధ్యులు. అవినీతి పరులు, నేరస్తులే వైసిపికి పోతున్నారు. స్వార్ధం కోసం వచ్చినవారే టిడిపి వీడారు. నేర రాజకీయాలతో సమాజానికి నష్టం. అన్ని ప్రాంతాలలో దశాబ్దాల వైరం వీడారు. విబేధాలు వీడి టిడిపితో కలిసి నడుస్తున్నారు. కర్నూలులో కోట్ల,కెఈ కుటుంబాలు-కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు. విజయనగరంలో బొబ్బిలి, గజపతి రాజులు-అరకులో కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల రాజులు. అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిశారు. తెలుగుదేశంపార్టీకి సంఘీభావం తెలిపారు.
క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉందనే వీళ్లంతా టిడిపికి మద్దతు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి . ఈ స్ఫూర్తి అన్ని నియోజకవర్గాలలో రావాలి. వ్యక్తిగత విభేదాలకు స్వస్తి చెప్పాలి. ఇది కలిసి పనిచేసే సమయం. బాక్సైట్ తవ్వకాల వెనుక నిజాలను కిషోర్ చంద్రదేవ్ చెప్పారు. వైఎస్ కుటుంబమే బాక్సెట్ తవ్వకాలకు సూత్రధారి. బాక్సెట్ తవ్వకాలపై కిషోర్ చంద్రదేవ్ అడ్డుకున్నారు. లైసెన్స్ లు రద్దు చేయించలేక పోయానన్న కిషోర్ చంద్రదేవ్. లైసెన్స్ లు రద్దు చేసిన ఘనత టిడిపిదే అన్నారు. ఈ నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైసిపి ముసుగు తొలగించాల్సింది గిరిజనులే.













