నా వల్లే హైదరాబాద్‌కు మెట్రో
నా వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శాసన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైట్రో కోసం పోరాడానని గుర్తు చేశారు. బెంగళూరు, అహ్మదాబాద్‌తో పాటు జాబితాలో హైదరాబాద్‌ను చేర్పించానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల హైదరాబాద్ మెట్రో ఇంత ఆలస్యం అయిందన్నారు. హెచ్ఐసిసి వేదిక, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తెలుగుదేశం హయంలోనివే అని తెలిపారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధిలో కూడా తన ముద్ర పోయేది కాదని బాబు సృష్టం చేశారు.













