వైసీపీ కార్యకర్తలుంటే ఏరిపారేయండి…. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి అక్కడ పర్యటించిన చంద్రబాబు… షెడ్యూల్లో లేనప్పటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యటించారు. గోప్పాడు మండలం యాదూరులో రోడ్ షో నిర్వహించిన ఆయన అక్కడి స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కరెంట్ సరిగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశౄరు. ”ఏం తిక్కతిక్కగా ఉందా? మందు తాగి వచ్చారా?. కరెంట్ లేకుంటే నీ కళ్లు కూడా కనిపించవు. తమషాగా ఉందా. మీరంతా వైసీపీ వాళ్లు . ఇక్కడికి వచ్చి తమాషాలు చేస్తున్నారు. మీకు పిచ్చి పట్టింది. మళ్లీ మాట్లాడితే టీడీపీ కార్యకర్తలకు చెబుతా!. ఏయ్… ఇక్కడ వైసీపీ కార్యకర్తలుంటే ఏరిపారేయండి. నా దగ్గరకు వచ్చి తమాషా చేస్తున్నారు. మీలాంటి వారికి 40 ఏళ్లలో కొన్ని వందల మందిని చూశా. ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు. నేను ముఖ్యమంత్రి హోదాలో వచ్చా ఒళ్లు దగ్గర పెట్టుకోండి. ఇంత మంది కార్యకర్తలుండగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతారా ఎంత ధైర్యం మీకు!. జగన్ మోహన్ రెడ్డి తాగించి పంపించారు మిమ్మల్ని. మీరు ఇప్పుడు తాగి ఉన్నారు. రేపు వచ్చి కలవండి. సమస్యలుంటే కలెక్టర్‌ను పంపిస్తా. ఒకవేళ మీరు చెప్పింది తప్పని తేలితే పోలీస్ కేసు పెట్టిస్తా. జాగ్రత్త” అంటూ గ్రామస్తులను చంద్రబాబు హెచ్చరించారు.













