చంద్రబాబు ఇంటికి నోటీసులు
విజయవాడ కృష్ణా కరకట్ట వెంటఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న నివాసంలో ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడంతో స్థానిక వీఆర్వో ప్రసాద్ నోటీసును గోడకు అంటించారు. వరదల వల్ల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా ముందుజాగ్రత్తగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తాడేపల్లి తహసీల్దార్ పేర్కొన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసుల్లో కోరారు.













