చంద్రబాబు సంచలన ప్రకటన : అప్పుడే అసెంబ్లీకి వస్తా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకనటన చేశారు. తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో మొదలుతో టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని చంద్రబాబు లుచ్చా అంటూ నోటికి పని చెబుతుండగా, మరో వైపు మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.













