నంద్యాలపై బాబు సంతోషం!
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో నంద్యాల ఉప ఎన్నిక విషయం చర్చకు వచ్చింది. మన శ్రమ ఫలించింది. నంద్యాల ప్రజలు మనకు బాగా మద్దతు ఇచ్చారని నాకు వచ్చిన సమాచారం సూచిస్తోంది. ఇతర మార్గాల నుంచి వస్తున్న సమాచారం కూడా అంతే ఉంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కొంత దూరంగా ఉన్న ముస్లిం మైనారిటీలు కూడా ఈసారి టీడీపీకి మద్దతు పలికారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పుంజుకోగలిగామని వారు పేర్కొన్నారు.













