వైసీపీ హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు : చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని రూ.16 లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని తెలిపారు. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. తలసరి అప్పు రూ.1.44 లక్షలుగా ఉందని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమని చంద్రబాబు తెలిపారు.













