రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి : చంద్రబాబు
నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే, వైసీపీ పతనం ఖాయమనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నంద్యాల జిల్లా ప్రజలకు కొత్త ఏడాది, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారు. ఎక్కడ చూసినా విధ్వంసక పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి. రాతి యుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా? అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నాం. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని అనేక కష్టాలు పడుతున్నాం. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. ఒక్కసారే అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ కొట్టక తప్పదు. జగన్కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు కేసులు మాత్రమే అని అన్నారు.













