వారందరికీ పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక సమస్య నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారన్నారు. వారందరికీ పరిహారం ఇవాల్వని డిమాండ్ చేస్తే.. ఇచ్చేది లేదంటూ మంత్రి మాట్లాడటం ప్రభుత్వ నిరక్ష్యానికి పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఇసుక విధానం రద్దు చేయాలని కార్మికులు అడిగారా? అని నిలదీశారు. ప్రభుత్వం ఇష్టానుసారం తీసుకొనే నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలికావాలా? అని ప్రశ్నించారు.













