పోరాటానికి సిద్ధంకండి …అండగా నేనుంటా
అధికార వైకాపా నేతల బెదిరింపులకు బెదరవద్దని, పోరాటానికి సిద్దం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను కలిసిన కార్యకర్తలు, సందర్శకులకు చెప్పారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు, భూవివాదాలు, వేధింపులపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైకాపా అరాచకాలతో గ్రామాల్లో ఉండే పరిస్థితి లేకుండా పోయిందని ఏ క్షణానైన దాడులు జరుగుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఎటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దని ఎవరి బెదిరింపులకు భయపడకుండా పోరాటానికి సిద్ధం కావాలని వారికి సూచించారు. పార్టీ, తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబును కలిసిన వారిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు.













