Chandrababu: దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది : సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఢల్లీిలో మన్మోహన్ (manmohan singh) పార్థివదేహానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి ఆవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని తెలిపారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి మాజీ ప్రధాని ప్రధాని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.













