బాలయోగి నాకెంతో ఆత్మీయుడు, ఆప్త మిత్రుడు: ముఖ్యమంత్రి చంద్రబాబు
నేడు లోక్సభ మాజీ స్పీకరు, దళిత నేత జీఎంసీ బాలయోగి వర్ధంతి. లోక్సభ మాజీ స్పీకరు జీఎంసీ బాలయోగి స్మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి. స్వతంత్ర్య భారత చరిత్రలో ఒక దళితుడిని లోక్ సభ స్పీకర్ని చేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆనాడు ఆనాడు కేంద్రమంత్రివర్గంలో చేరాలని, ఏడు నుంచి ఎనిమిది మంత్రిపదవులు ఇవ్వటానికి సిద్ధమైన ప్రధాని వాజ్పేయి. పదవులు తమకు ముఖ్యంకాదని చెప్పాం. ఎట్టకేలకు ఒత్తిడితో రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిని తీసుకున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
లోక్ సభ స్పీకరుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన బాలయోగి. ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, లోక్సభ స్పీకరుగా సేవలందించిన బాలయోగి. బాలయోగి నాకెంతో ఆత్మీయుడు, ఆప్త మిత్రుడు: ముఖ్యమంత్రి చంద్రబాబు
కోనసీమలో ఓఎన్జీసీకి సామాజిక బాధ్యత గుర్తు చేయడానికి ఉద్యమాన్నే చేపట్టాం: చంద్రబాబు
ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జీఎంసీ బాలయోగి: చంద్రబాబు నివాళి
ఓఎన్జీసీ సహకారంతో నాడు కోనసీమలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కృషి చేసిన బాలయోగి: సీఎం చంద్రబాబు
బాలయోగి స్మృతులు మా మనసులో పదిలం: చంద్రబాబు













