గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపై దాడులు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యాక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు ఎన్టీఆర్నని తెలిపారు. వైసీపీ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ పాపాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. దళిత వైద్యాధికారి అచ్చెన్న చనిపోతే సీఎం నోరు మెదపలేదని మండిపడ్డారు. టీడీపీ పాలనలో దళితుల అభ్యున్నతికి కృషి చేశామని తెలిపారు. కేఆర్ నారాయణ్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి గెలిపించింది టీడీపీనేనని తెలిపారు. దళిత నేత జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.













