ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబునాయుడు
ఎప్పటిలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన ముఖ్యమంత్రి. తుళ్లూరు మండలం వెంకటపాలెం లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు.వెంకటపాలెం ప్రజలు ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికారు.
గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు, శ్రీ నక్కా ఆనంద బాబు, కె ఎస్.జవహర్, చీఫ్ విప్ శ్రీ పల్లె రఘునాద రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బి.అర్జునుడు, శ్రీమతి పీతల సుజాత,
శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.













