లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం : చంద్రబాబు
తాడిప్రతి ఘటనలో తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఉద్యోగం చూపడమే కాక వ్యక్తిగతంగానూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఎం సూచన మేరకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకరరెడ్డి లక్ష్మీ ప్రసన్నతో కలిసి సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెతో మాట్లాడి విద్యార్హతలు తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నానని చెప్పగా గ్రూప్-2 ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తదనుగుణంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగం తర్వాత ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆరు నెలలకోసారి వచ్చి కలవాలని సూచించారు. అనంతపురం జిల్లా ముక్తాపురంలో సభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించటం తెలిసిందే.













