చంద్రబాబు సంచలన నిర్ణయం
సంక్రాంతికి నారావారిపల్లె వెళ్లే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ ఏడాది మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే సంక్రాంతి సమయంలో నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబసభ్యులు పర్యటించే అవకాశం ఉంది.













