ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటాం : చంద్రబాబు
ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోసం చట్టపరంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రతి పేద ముస్లిం రంజాన్ పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశామన్నారు. ముస్లిం పిల్లలకు చక్కటి విద్యను అందించాలని 25 గురుకుల పాఠశాలల ద్వారా రూ.వంద కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. విజయవాడ, కర్నూలు, కడప జిల్లాల్లో హౌజ్ హౌస్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. నేరుగా మక్కా వెళ్లేందుకు విమాన సౌకర్యం కల్పిస్తామన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించి వచ్చే ఆదాయాన్ని ముస్లింల కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు.













