కియా కోసం మౌలిక వసతుల కల్పన
అనంతపురం జిల్లాలో కియా మోటార్ కార్ల పరిశ్రమను వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని, మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో కియా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కియో మోటార్ కార్ల పరిశ్రమ స్థాపనకు భూముల అప్పగింత జూన్ 1 నాటికి పూర్తి కావాలని, నేల చదును పనులను కూడా అప్పటి కల్లా ముగించాలని నిర్దేశించారు. 15 రోజుల్లోగా తాత్కాలిక ప్రాతిపదికన నీరు, విద్యుత్ కియా మోటార్స్‌కు సమకూర్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో పేరు నమోదు చేసుకున్న కియా మోటార్స్, ముందుగా ట్రైనింగ్ సెంటర్, టౌన్ షిప్ నిర్మించనుంది.













