ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు : చంద్రబాబు
నారా బ్రహ్మణీ రాజకీయ ప్రవేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చాడు. బ్రాహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బ్రహ్మణి రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణలో టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబును తెలంగాణ నేతలు కోరారు. చంద్రబాబు నేతల కోరికను తోచిపుచ్చారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. నారావారి కోడలుగానే కాకుండా హెరిటేజ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బ్రహ్మాణి బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హెరిటేజ్ తరపున బ్రహ్మాణి వెళ్లారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆమె అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ అందరినీ మన్ననలు అందుకుంటోందన్న సంగతి తెలిసిందే.













