ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ నిర్ణయం ఉండదు
ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ నిర్ణయం ఉండబోదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారని ముస్లిం మతగురువులు తెలిపారు. పార్లమెంట్లో యూసీపీ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ పలువురు ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ యూసీసీ దేశ సంస్కృతికి విరుద్ధమని వివరించామన్నారు. ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.













