Mridulkumar :భారత రాయబారి మృదుల్కుమార్తో సీఎం చంద్రబాబు భేటీ
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్(Mridulkumar)తో భేటీ అయ్యారు. జ్యురిచ్ విమానాశ్రయం(Zurich Airport) నుంచి హిల్టన్ హోటల్‌కు చేరుకున్న ఆయన మృదుల్కుమార్తో వివిధ అంశాలపై చర్చించారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది. అనంతరం అక్కడి తెలుగువారితో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్(Meet and Greet) కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత జ్యురిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే.













