పరిస్థితి చేయిదాటి పోకముందే.. కాపాడుకోవాలి : చంద్రబాబు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కై పెన్నా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. పెద్దపప్పూరు అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరిగిందని గుర్తు చేశారు. అడ్డగోలు తవ్వకాలతో పర్యావరణానికి నష్టం జరుగుతుంది. ఎన్జీటీతో పాటు కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నా అక్రమ తవ్వకాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలమయ్యారు. పరిస్థితి చేయిదాటి పోకముందే సహజ వనరులను కాపాడుకోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.













