లిడ్ కాప్ మొబైల్ కార్గో వ్యాన్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఉండవల్లి లోని ప్రజావేదిక వద్ద శనివారం సాయంత్రం వాహనాలకు జెండా ఊపి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.
అంబేద్కర్ జీవితాన్నే ఆదర్శంగా తీసుకోండి. పుట్టుక మన చేతిలో లేదు, కానీ మన భవిత మన చేతిలో ఉందని అంబేద్కర్ చెప్పారు.
చర్మకారులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం. డప్పు కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 60 హాస్టళ్ల కోసం పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం రూ.330 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎస్సి కమ్యూనిటీ కి చెందిన చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కోసం ఈ పధకాన్ని ప్రవేశ పెట్టింది. ముగ్గురు లబ్ధిదారులు ఒక యూనిట్ గా ఎంపిక ప్రక్రియ.
యూనిట్ ధర రూ.8.12 ల్లో లబ్దిదారులు వాటగా 20 శాతం చెల్లించాలి.. మిగిలిన 80 శాతం లీడ్కాప్ నిబంధనలు కు లోబడి రుణాన్ని 9 శాతం వడ్డీ తో అందచెయ్యడం జరుగుతున్నది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గల పరిధిలో 415 మొబైల్ కార్గో వాహనాలు 2018-19 అందచెయ్యడం జరుగుతున్నది.
ముగ్గురు లబ్ధిదారులు 21 సంవత్సరాల వయస్సు పైబడి, 10వ తరగతి అర్హత కలిగి వారిలో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండాలి.
తొలి ఫేస్ లో 100 వాహనాలు లబ్ధిదారులకు అందచేస్తున్నారు.
రోడ్డుప్రక్కన వృత్తి చేసుకునే వారి సౌలభ్యం కోసం దేశంలోనే తొలి సారిగా ఇటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు.
ఈ వర్గాల వారిని పైకి తీసుకుని వొచ్చేందుకు , సమాజంలో గౌరవాన్ని పెంచేలా వారికి ఏసీ వాహనం, మొబైల్ ఫోన్, వినియోగదారుల కు అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్ సేవలను కూడా త్వరలోనే అందుబాటులో కి తీసుకుని రావడం జరుగుతున్నది.
ఈ వాహనాన్ని జిపిఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొళ్ళ పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు కేంద్ర తొళ్ళ పరిశోధన సంస్థ, చెన్నై వారి సహకారం తో నైపుణ్యాభివృద్ది కార్యక్రమం నిర్వహిస్తారు.
కుట్టుమిషన్,ముడి సరుకు, టూల్ కిట్ తో కూడి వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి సిద్దంగా ఉంచనున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, లిడ్ కాప్ విసి & ఎండి ఎమ్. సాధుసుందర్, ఛైర్మన్ గూడూరు ఎరిక్సన్ బాబు, జీఎం మధుసూదనరావు, డైరెక్టర్ ఎస్.రవీంద్ర వర్మ లు పాల్గొన్నారు.













