ఏపీ భవన్ లో కోలాహలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో కోలాహలం నెలకొంది. దీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. ఏపీ భవన్ రోడ్డులో జాతీయ, అంతర్జాతీయ ఓబీ వాహనాలు బారులు తీరాయి. ఏపీ భవన్ మొత్తం జనంతో కిటకిటలాడుతున్నాయి. దీక్షకు మద్దతుగా పలు జాతీయ పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దీక్ష స్థలిలో నేతల ప్రసంగాలు కొనసాగుతున్నాయి.













