అమరవీరులకు అదే నిజమైన నివాళి : చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, అమరవీరులకు అదే నిజమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్లోని తననివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో దేశభక్తుల త్యాగఫలంతో నేడు మనకు స్వేచ్ఛ సిద్ధించింది. వారందరినీ స్మరించుకొని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇది. అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖితపూర్వక రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా మన దేశాన్ని తీర్చిదిద్దారు.వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజ్యాంగ వ్యతిరేక ధోరణుల నుంచి వ్యవస్థలను రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.













