చలన చిత్ర రంగానికి తీరని లోటు : చంద్రబాబు
ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. విజయనిర్మల మృతి తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు అని అన్నారు. నటిగా, దర్శకురాలిగా తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. సామాజిక ఇతివృత్తాలే కథాంశాలుగా అనేక కుటుంబ కథా చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారన్నారు. విజయనిర్మల సాధించిన అవార్డులు, పురస్కారాలే ఆమె ప్రతిభకు గీటురాళ్లు అని శ్లాఘించారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి, అత్యున్నత స్థాయికి చేరుకున్నారన్నారు. విజయనిర్మల కుటుంబ సభ్యులుకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.













