పి.వి.సింధుకు సీఎం చంద్రబాబు అభినందనలు
ప్రపంచ బాడ్మింటన్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన పి.వి.సింధూ రజిత పతకాన్ని సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. జపాన్ క్రీడాకారిణకి ప్రతీ మ్యాచ్లోనూ గట్టిపోటీ ఇస్తూ, భవిష్యత్తులో స్వర్ణపతాకాన్ని సాధిస్తుందన్న విశ్వాసాన్ని బాడ్మింటన్ క్రీడాకారుల్లో, అభిమానుల హృదయాల్లో నమ్మకాన్ని కలిగించిందన్నారు. సింధూ చివరి మ్యాచ్లో కనబరచిన ప్రతిభ అపారమైంది. ఎట్టకేటకు తాను గెలుపొందాలన్న పట్టదలతో అడిన ఆటతీరు అభినందనీయమని అన్నారు. గతంలో తాను ఉమ్మడి రాష్ట్రంలో పుల్లెల గోపీచందకు బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించానని, నాటి నాటిన విత్తనాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని గడించే ఫలాలు ఇస్తున్నాయని, భవిష్యత్తులో ఇటువంటి మరెన్నో పతకాలు సింధూ సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.













