మూడు టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి.. 3 రాజధానులు కడతారా? : చంద్రబాబు
రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులు కడతారా? అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు శారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భంగా ఎక్కువ తృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో బిచ్చం ఎత్తుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని వేడుకుంటున్నారని వెల్లడించారు. హోదా, అమరావతి, పోలవరం గురించి అడగటం లేదని ఆక్షేపించారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ హామీ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. హామీ నెరవేర్చని జగన్ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లిలా ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం ఎక్కడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.













