మహానాడు ప్రజా విజయం.. చంద్రబాబు
మహానాడు ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు విజయవంతం కావడంతో చంద్రబాబు ముఖ్యనేతలతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా నేతలకు చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు వేదిక అయ్యిందన్నారు.రాష్ట్రాన్ని స్వరనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని పేర్కొన్నారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు.













