ఉప ఎన్నికలు రావు…వస్తే కచ్చితంగా పోటీ
వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాకాదని ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ ఎంపీలు ఇచ్చిన రాజీనామాలను జూన్ రెండో తేదీవరకూ అమోదించే అవకాశం లేదు. అప్పటికి ఎన్నికల గడువు ఏడాదిలోపే ఉంటుంది. అందువల్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే టీడీపీ కచ్చితంగా పోటీ చేసి తీరుతుంది. ఇందుకు సిద్ధంగా ఉండండి అని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో వైసీపీ లోపాయికారి అవగాహనతో వ్యవహరిస్తోందన్నారు. ఈ విషయాన్ని రోజూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు.













