ఆ సంస్థ నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా!
అసెంబ్లీలో సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. హెరిటేజ్ సంస్థతో తమకు సంబంధం లేదని చంద్రబాబు సృష్టం చేశారు. హెరిటేజ్ సంస్థ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. లేదంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజు కూడా హెరిటేజ్ సంస్థపై వాడీవేడీ చర్చ జరిగింది. గుడివాడలో ఉల్లి పంపిణీ క్యూలైన్లో ఒక వ్యక్తి మరణించారని చంద్రబాబు చెప్పినప్పుడు.. హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.135కు అమ్ముతున్నారని వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. హెరిటేజ్ ఫ్రెష్ మావద్ద లేదు. అది ప్యూచర్ గ్రూప్ సంస్థ వద్ద ఉంది. భారతి సిమెంట్, సాక్షి పేపర్, సోలార్ విండ్పవర్పై మేం కూడా మాట్లాడుతాం. మీ అందరి విషయాలు ప్రజలకు తెలియాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













