ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలిః సీఎం చంద్రబాబు
నేను కూడా నల్లచొక్కా ధరిస్తాను. రాష్ట్రవ్యాప్తంగా నల్లచొక్కాలతో నిరసనలు. నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన తెలపాలి. నరేంద్ర మోది విశాఖ రాకను అందరూ నిరసించాలి. మనకు తీరని అన్యాయం చేశారు. 5కోట్ల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. గాయాలను కెలికేందుకే మోది విశాఖ రాక. మన గాయాలపై కారం జల్లడానికే మోది రాక. మోది తిరిగి వెళ్లేదాకా నిరసనల జోరుతో హోరెత్తాలి. బహిరంగ లేఖలో మోది చేసిన ద్రోహాన్ని నిలదీశాను. 5ఏళ్లలో మోది చేసిన అన్యాయాన్ని నిగ్గదీశాను. విశాఖ రైల్వే జోన్ మోది మోసపూరిత నిర్ణయం. ఆదాయం లేని జోన్ బిజెపి కుట్రపూరిత నిర్ణయం. దీనిని రాష్ట్రంలో అందరూ ఖండించాలి, మోది నమ్మకద్రోహాన్ని నిలదీయాలి. మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారు. జోన్ అడిగితే డివిజన్ కూడా తీసేశారు. రాబడి లేని మాయా జోన్ ను మనకు ఇచ్చారు.













