కియా యాజమాన్యానికి చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు కియా యాజమాన్యానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న చంద్రబాబు, ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలను కేంద్రంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ప్రపంచ వేదికపై ఇది ఓ ప్రత్యేకతను చాటుకుందన్నారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.













