సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా డీఎస్సీ పై తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.













