సీఎం చంద్రబాబు రీకాల్ పిటిషన్ ?
బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మబాద్ కోర్టుకు హాజరుకారాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు సహా 16 మంది ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిదే. కాగా ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని సృష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణకు అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.













