2019 నాటికి పోలవరం పూర్తి : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి నిధులు వేగంగా విడుదల చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటలో ఉన్న ఆయన ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. తాజా అంచనాల ప్రకారం భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని కోరారు. ఇప్పటి వరకు 2010-11 నాటి పాత అంచనాలు ప్రకారమే నాబార్డు ద్వారా కేంద్ర నిధులు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే 2013 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కేవలం భూసేకరణ, పునరావాసం కల్పించే విషయంలోనే ఖర్చు 10 రెట్లు పెరిగింది. ఈ విషయాలను ఆర్థిక మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు, కొత్త అంచనాల వెంటనే ఆమోదిస్తూ ఆ మేరకు నిధులు అందజేయాలని కోరారు.













