మంత్రివర్గ విస్తరణ త్వరలో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభించారు. శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ను ముఖ్యమంత్రి అనివార్యంగా భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటం, ఏ.పి పట్ల కేంద్రం వైఖరి వంటి కారణాలు సీఎం ను కొత్త మార్పులవైపు ద ష్టి సారించేలా చేశాయి. కీలక మార్పులు చోటుచేసుకునే విసయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019 సాధారణ ఎన్నికలకు ముందుగా జరగనున్న మంత్రివర్గ విస్తరణ ఇదే చివరిదని భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామా చేయడం కూడా మంత్రివర్గ విస్తరణకు మరో కారణంగా భావిస్తున్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణలో చోటుచేసుకున్న పరిణామాలను ద ష్టిలో వుంచుకుని ముఖ్యమంత్రి వ్యవహరించే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్న అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల సమయం కావడం కూడా విస్తరణను ప్రభావితం చేయబోతుండటంతో పార్టీలో ఆశావహుల సంఖ్య సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఇదిలా వుండగా రాష్ట్ర అసెంబ్లి స్పీకర్గా వున్న డాక్టర్ కోడెల శివప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం వుందని సమాచారం. ఇంతవరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా వున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాజీనామాతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. అయితే అదే సామాజికవర్గానికి చెందిన వారికి తిరిగి అదే శాఖను కేటాయించే అవకాశా లున ్ష్న యి.













