ఈ నెల 21న ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 21వ తేదీన శంకుస్థాపన చేసే అవకాశముంది. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయినట్లు సమాచారం. ఓర్వకల్లుకు సమీపంలోనే గని-శకునాల సౌర పార్కు ఉండడంతో దాన్ని ఆయన సందర్శించే అవకాశముందని భావిస్తున్నారు. సౌర పార్కు సామర్థ్యం వెయ్యి మెగావాట్లు కాగా 950 మెగావాట్ల స్థాపన ఇప్పటికే పూర్తయింది. ప్రపంచంలోనే అతి పెద్ద (ఒకేచోట) సౌర పార్కుగా ఇది అవతరించింది. ఈ పార్కును ప్రధాని నరేంద్ర మోదీచే అధికారికంగా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.













