ప్రధాని పదవిపై నాకు ఆశ లేదు
ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రారని తేల్చి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంతో పాటు ప్రతిపక్ష కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీతో పాటు జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్పైనే తన పోరాటమని సృష్టం చేశారు. ఆ ముగ్గురూ ఒక్కటే. మోదీ జగన్ను రక్షిస్తున్నారు. కేసీఆర్ జగన్కు మద్దతిస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారికి ఓటమి తప్పదు అని బదులిచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది. మోదీ మమ్మల్ని మోసం చేశారు. ప్రత్యేక హోదాపై ఆయన అనేక హామీలు ఇచ్చారు. కానీ అమలులో వంచించారు. మాకు లక్ష కోట్లు కావాల్సి ఉంది అని అన్నారు.













