చంద్రబాబు గృహ నిర్బంధం
టీడీపీ, వైకాపాలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బందం చేశారు. చలో ఆత్మకూరు కు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలను తెలిపాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పల్నాడులో 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు.













