ఢిల్లీ లో చంద్రబాబు ధర్మపోరాట దీక్షతో దద్దరిల్లనున్న ఢిల్లీ
ఢిల్లీ లో చంద్రబాబు ధర్మపోరాట దీక్షతో దద్దరిల్లనున్న ఢిల్లీ
అదే బాటలో మమత, కుమారస్వామి
వచ్చే వారం దేశ రాజఽధాని ఢిల్లీ ప్రతిపక్ష నేతల ధర్నాలతో దద్దరిల్లనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నారు. దీక్షకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్షాల నేతలతోసహా 23 పార్టీల అధ్యక్షులు సంఘీభావం ప్రకటించనున్నారు. 12న రాష్ట్రపతిని కలిసి ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు వినతిపత్రం సమర్పించనున్నారు.
అలాగే, కోల్‌కతాలో సీబీఐ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టిన మమతా బెనర్జీ.. ఢిల్లీలోనూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ మాటిమాటికీ ప్రయత్నిస్తుండడంపై సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో నిరసన తెలపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రతిఫలింపజేసేందుకు ఢిల్లీని వేదికగా చేసుకోవడం.. మోదీకి వ్యతిరేకంగా వారు సంఘటితం కావడానికి దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.













