జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 45వ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఈ పర్వదినాన ఆనందమయమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ఆప్యాయంగా పేర్కొన్నారు. అందుకు ప్రతిస్పందించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్లో ఆహ్లాదకరమైన ఆనందంగా, మీ ఆశీర్వచనానికి ధన్యవాదాలు అంటూ అంతే ఆప్యాయంగా జగన్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య ఇటువంటి అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.













