దేవినేని ఉమా మైలవరం కాదట…? సంచలన నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు…?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిలబడాలి అంటే కొన్ని సంచలన నిర్ణయాలు తప్పవు అనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. రాజకీయంగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు ఇక నుంచి ఉండే పరిస్థితి వేరు. అధికార పార్టీ కాస్త అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. పలు ఉమ్మడి జిల్లాల పర్యటనలకు ఆయన సిద్దమయ్యారు. పలువురు కీలక నేతలతో మాట్లాడుతూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా కడప జిల్లా పర్యటనకు వెళ్ళిన ఆయన నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక ఈ పర్యటనల సందర్భంగానే కొన్ని నిర్ణయాలను పార్టీ నేతలకు చెప్పేస్తున్నారు. కడప ఎంపీ సీటు విషయంలో క్లారిటీ ఇచ్చేసారట. ఇక ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా నేతలకు ఆయన క్లారిటీ ఇస్తారని సమాచారం. అలాగే బందరు ఎంపీ సీటు ని కూడా ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఒక కీలక నేతను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు మైలవరం మీద బాబు ఫోకస్ చేసారట.
మైలవరం అభ్యర్ధిగా బొమ్మసాని శ్రీనివాసరావు ని ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. దేవినేని ఉమాను పెనమలూరు లేదా నూజివీడు లేదా ఏలూరు ఎంపీ స్థానంలో నిలబెట్టాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని దేవినేని ఉమాను కేబినేట్ లో ఉంచాలి అనుకుంటే దాదాపుగా నూజివీడు సీటు ని ఖరారు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు దేవినేని ఉమా. అందుకే ఆయన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు.
మైలవరంలో ఆయన గెలిచే అవకాశం ఉన్నా సరే బలహీనంగా ఉన్న సీటు ఇవ్వాలని భావిస్తున్నారట. నూజివీడు లో ఎలా అయినా సరే గెలవాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు అక్కడి నేతలతో టచ్ లో ఉన్నారట. దేవినేని ఉమాకు సీటు ఇస్తే మంచిది అనే సూచనలు సలహాలు అక్కడి నేతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ నేతలు అంటున్నారు.













