‘దొంగే, దొంగ..దొంగ’ అన్నట్లుగా వైసిపి వ్యవహరిస్తోంది: సీఎం చంద్రబాబు
వాళ్లు చేసే తప్పుడు పనులు ఇతరులకు ఆపాదిస్తారు. తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారు. దొంగ ఓట్లు చేర్చేది వాళ్లే, ఫిర్యాదులు పంపేది వాళ్లే. తప్పుడు మెయిల్స్, దొంగ సర్వేలలో ఆరితేరారు. డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన. హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటనలు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరు.
వైసిపి, బిజెపి కుట్రలపై ప్రజల్లో చర్చ జరగాలి. స్థానికంగా వైసిపి ప్రలోభాలను ఎండగట్టాలి. టిడిపిపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలి. నమ్మకానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో విశ్వసనీయతే తెలుగుదేశం పార్టీ బలం. మనపై నమ్మకాన్నిమరింత పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి.













