అంపైరే లేకుండా ఆటా?
ఔట్ అయిన బ్యాన్స్మెన్ అంపైర్‌ను నిందించినట్లు..ఓటమి ఖరారు కావడంతో విపక్షాలు ఈవీఎంలను నిందిస్తున్నాయి అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు అంపైరే లేకుండా మ్యాచ్ ఆడేయాలని మోదీ జట్టు ప్రయత్నిస్తోంది. రిఫరీ వ్యవస్థనే నాశనం చేస్తోంది. ఈ జట్టును దేశ ప్రజలు ఈ నెల 23న పక్కన పెట్టేస్తున్నారు. అంఫైర్‌ను పెట్టుకుని, వ్యవస్థల్ని సంరక్షిస్తూ నిబంధనల ప్రకారం ఆడే జట్టుకు పట్టం కడుతున్నారు అని తెలిపారు.
మోదీలా ఎన్నికల కమిషనపై తాము ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. గోద్రా అల్లర్ల అనంతరం అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డో తన బృందంతో గుజరాత్లో పర్యటించారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో మీరు జేమ్స్ మైఖేల్ లింగ్డో ఇటలీ నుంచి వచ్చారా? రాజీవ్‌గాంధీ కుటుంబాన్ని అడగాలి అని వ్యాఖ్యానించారు. లింగ్డో సోనియాగాంధీ చర్చిలో కలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఈసీని మతం పేరిట, వ్యక్తిగతంగా విమర్శించే మీరు మాకు నీతులు చెప్పేది అని మోదీపై మండిపడ్డారు.













