16 ఏళ్లలో కన్నా లక్ష్మీనారాయణ నాపై 3 పిటిషన్లు వేశారు : చంద్రబాబు
వైఎస్ స్వయంగా 13పిటిషన్లు వేశారు. అనుచరులతో 12కేసులు వేయించారు. ఆ 9ఏళ్లలో మొత్తం 25కోర్టు కేసులు వేశారు. జగన్ తల్లితో 2464పేజీలతో పిల్ వేయించారు. అన్నింటినీ కోర్టులు కొట్టేశాయి. ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారు. పోలవరంపై, అమరావతిపై, పట్టిసీమపై కేసులు వేశారు. కోర్టు కేసులతో అభివృద్ధికి అడ్డంకులు. జగన్, మోది కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారు. జగన్, మోది కుట్రలను ‘కన్నా’ అమలు చేస్తారు. వైసిపి, బిజెపి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్ అత్యాశ రాష్ట్రానికే పెను ప్రమాదం. అత్యాశతోనే జగన్మోహన్ రెడ్డి పతనం. డబ్బు, అధికారం వ్యామోహం ఉండరాదు.













