Chandrababu : హద్దుమీరితే ఇకపై ఊరుకునేది లేదు : సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ (Jagan) తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎంత ధైర్యం ఉంటే తెనాలి (Tenali)లో గంజాయి బ్యాచ్‌ను పరామర్శిస్తారని మండిపడ్డారు. పొదిలిలో బాధ్యత లేకుండా పర్యటిస్తారా? దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? రౌడీలను వెంటేసుకొని వెళ్లి రౌడీయిజం చేస్తారా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు. ఇప్పటి వరకూ నా మంచితనాన్ని చూశారు. ఇకపై ఉపేక్షించను. హద్దుమీరితే ఇకపై ఊరుకునేది లేదు. 11 సీట్లకే జనం పరిమితం చేసినా వాళ్లకు బుద్ది రాలేదు. వైసీపీ (YCP) తీరును సరైన సమయంలో మరోసారి ఆధారాలతో ఎండగడతా. అమరావతి (Amaravati)పై వ్యాఖ్యలను దృష్టి మళ్లించేందుకు పొదిలిలో దాడులు చేశారు అని అన్నారు.













