ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ : చంద్రబాబు
తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తప్పించారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని అన్నారు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే, ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, రాజకీయాల ద్వారా దేశానికి దశ దిశ నిర్దేశించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన నిర్లక్ష్యంగా కారణంగానే కందూకూరు, గుంటూరులలో ప్రజలు ప్రాణాలు కోల్పోయన్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసుల ద్వారా చావు కుట్రలు పన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీఎం జగన్ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. పేదల రక్తాన్ని కూడా జలగాల తాగేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ సిద్దాంతాలను జయప్రదం చేయాలంటే సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని అన్నారు.













